అఖిల్, చైతు కంటే నాగ్ చాలా బెటరేమో?

నాగార్జునతో పోలిస్తే ఆయన ఇద్దరు కొడుకులు నాగ చైతన్య, అఖిల్ చాలా వెనకబడిపోయినట్లే ఉన్నారు. ఒకప్పుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా తెర మీదకి వచ్చిన నాగార్జున మధ్యలో చాలా ఎదురుదెబ్బలు తిన్నప్పటికీ, ఇండస్ట్రీలో, ప్రజలలో చాలా వేగంగానే తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించగలిగారు. ఆయన కొడుకు నాగ చైతన్య కూడా మంచి పేరు సంపాదించుకొన్నప్పటికీ హిట్స్ విషయంలో, సినిమాల రిలీజ్ విషయంలో తండ్రితో పోటీపడలేకపోతున్నాడు.

ఇక రెండో కొడుకు అఖిల్ హీరో గా చేసిన మొదటి సినిమా ‘అఖిల్’ పెద్ద ఫ్లాప్. అనేక వైవిధ్యమైన సినిమాలు చేస్తున్న నాగార్జున, అఖిల్ కోసం మంచి ల్యాండింగ్ సినిమా సిద్ధం చేసి ఇవ్వవచ్చు. అఖిల్ సినిమా కధ విన్నప్పుడే అది హిట్ అవుతుందో లేదో గ్రహించవచ్చు. కానీ కధలో బలం లేకపోయినా సినిమాకి సిద్ధం  కావడం ఒక తప్పు. అటువంటి సినిమాకి, అఖిల్ కి అనవసరమైన హైప్ కూడా క్రియేట్ చేయడం మరో తప్పు. వెరసి అఖిల్ అట్టర్ ఫ్లాప్ అయింది.

అప్పటి నుంచి అఖిల్ మరో సినిమా చేయలేదు. హను రాఘవపూడితో రెండవ సినిమా అనుకొన్నాడు కానీ ఆయన నితిన్ తో సినిమాకి కమిట్ అయిపోయారు. 14 రీల్స్ బ్యానర్ క్రింద ఆ సినిమా త్వరలో మొదలవబోతోంది. మరి అఖిల్ అంతవరకు వేచి చూస్తాడో, వేరే సినిమామొదలుపెడతాడో చూడాలి. 

నాగార్జున వరుసగా మనం, ఊపిరి, సోగ్గాడే చిన్ని నాయినా వంటి హిట్స్ తో నేటికీ దూసుకుపోతుంటే, నాగ చైతన్య పడుతూ లేస్తూ ప్రయాణం సాగిస్తున్నాడు. అఖిల్ మొదటే తప్పటడుగు వేశాడు. నాగార్జున 56 ఏళ్ళ వయసులో కూడా తన కొడుకులిద్దరికీ గట్టి పోటీయే ఇస్తున్నారు.