రాశీఖన్నాతో ఆ హీరో పబ్లిక్ రొమాన్స్

రాశీఖన్నా తెలుగు సినిమాల్లో తక్కువ టైంలోనే మంచి మంచి అవకాశాలను అందుకుంటున్న హీరోయిన్. ఊహలు గుసగుసలాడేతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామకు మంచి ఆఫర్లే వచ్చాయి. రవితేజతో బెంగాల్ టైగర్ లో మెరిసిన ఈ హీరోయిన్ ఇప్పుడు తెలుగులో ఓ హీరోతో రొమాన్స్ చేస్తోందట. అయితే ఇది రియల్ లైఫ్ లో కాదులెండి రీల్ లైఫ్ లో. అవును ఇంతకీ ఆ హీరో ఎవరో తెలుసా..? 

తెలుగులో ఎనర్జీటిక్ హీరోగా గుర్తింపు సాధించిన యంగ్ హీరో రామ్ తో రాశీఖన్నా రొమాన్స్ చేస్తోంది. విశాఖపట్నంలో ఈ ఇద్దరు హైపర్ సినిమా షూటింగ్ లో భాగంగా కొన్ని రొమాన్స్ సన్నివేశాల షూటింగ్ లో ప్రస్తుతం పాల్గొంటున్నారు. ఈ నెల 20 వరకు జరిగే ఈ షూటింగ్ షెడ్యూల్‌తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. సెప్టెంబర్ రెండో వారంలో ఆడియోను రిలీజ్ చేసి సెప్టెంబర్ 30న విజయదశమి కానుక గా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.