
జనసేన పార్టీ స్థాపించినప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్పీచ్ ఒకేసారి, అటు రాజకీయాల్లో, ఇటు సినిమా వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది. ముఖ్యంగా సినీ పెద్దలు ఎంతో మంది పవన్ ని, అతని స్పీచ్ లోని ఆవేశాన్ని, దానిలోని అర్ధాన్ని బాగా గ్రహించి కొనియాడారు. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న పవన్, 2019 ఎన్నికలకు తప్పకుండా పోటీ చేస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఐతే జనసేన అని ప్రస్తావన వచ్చినప్పుడల్లా, పవన్ తప్ప మరో పేరు వినపడదు. కానీ ఇప్పుడు మరోసారి, అది కూడా సినీ వర్గాల నుండి హీరో సునీల్ ముందుకొచ్చాడు. పవన్ అంటే తనకి చాలా ఇష్టమని, ఆయన అడిగితే తప్పకుండా పార్టీకి ఏదైనా పని చేసి పెడతానని చెప్పాడు. అయితే పని మాత్రమే చేస్తానని, పార్టీ నుండి పోటీ చేసే ఉద్దేశం ఏ మాత్రం లేదని సునీల్ స్పష్టం చేశాడు. 
ప్రస్తుతం పవన్ డాలీ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఒక సినిమా చేస్తాడు. అది కూడా పూర్తయ్యాక, రాజకీయాలపై పవన్ ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశముంది. అప్పుడు ఇంకెంతమంది సినిమా వాళ్ళు పవన్ కోసం ముందుకొస్తారనేది చూడాలి.