RRR కు అలియా గుడ్ బై..!

ఎన్.టి.ఆర్, రాం చరణ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవీ ఆర్.ఆర్.ఆర్. ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నారని తెలుస్తుంది. రీసెంట్ గానే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ఒలివియా మోరిస్ కు వెల్కం చెప్పిన రాజమౌళి అలియా భట్ కు గుడ్ బై చెప్పేశారట. 

అదేంటి అంటే సినిమాలో ఆమె పోర్షన్ మొత్తం షూట్ చేయడం పూర్తయిందట. అందుకే అలియా భట్ ఆర్.ఆర్.ఆర్ టీం కు బై బై చెప్పేసిందట. రాం చరణ్ కు జతగా అలియా భట్ నటిస్తుంది. సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా.. తారక్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నాడు. 2020 జూలై 30న ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ ప్లాన్ చేశారు. అనుకున్న టైం కు సినిమా రిలీజ్ చేయడం కష్టమే అన్న టాక్ వినిపిస్తుంది.