వెంకీమామలో రెండూ ఉంటాయట

విక్టరీ వెంకటేష్ అక్కినేని నాగ చైతన్య ఇద్దరు కలిసి చేస్తున్న క్రేజీ మల్టీస్టారర్ మూవె వెంకీమామ. కె.ఎస్ రవింద్రన్ అలియాస్ బాబి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. థమన్ మ్యూజిక్ అందిస్తుండగా ఈ సినిమాను డిసెంబర్ 13న రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. సినిమాలో మామా అళ్లుల్లుగా వెంకటేష్, నాగ చైతన్య నటిస్తున్నారు.

రియల్ లైఫ్ లో వారి పాత్రలనే సినిమాలో పోశిస్తున్నారని చెప్పొచ్చు. ఇదిలాఉంటే ఈ సినిమాలో సెంటిమెంట్, కామెడీ రెండు సమపాళ్లలో ఉంటాయని తెలుస్తుంది. కామెడీ కూడా సినిమా కథకు అనుగుణంగా ఉండాలని నిర్మాత సురేష్ బాబు చెప్పారట. అంతేకాదు సెంటిమెంట్ కూడా పండాలని చెప్పాడట. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుండగా రష్ చూసిన మేకర్స్ చాలా సాటిస్ఫైడ్ గా ఉన్నారని తెలుస్తుంది. ఈ ఇయర్ మొదట్లో ఎఫ్-2తో హిట్ అందుకున్న వెంకటేష్ వెంకీమామతో మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.