
ఈ సినిమా ఫ్లాప్, ఈ సినిమా హిట్టు అని రిలీజ్ కి ముందే కొన్ని సినిమాల మీద ఒక టాక్ ఉంటుంది. కానీ షూటింగ్ మొదలైన రోజు నుండి రికార్డులన్నీ మడతెసి కొడుతుందని అనిపించుకున్న సినిమా బాహుబలి. సోషియో ఫాంటసీ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా, తెలుగులోనే కాకుండా, హిందీ లో డబ్ అయ్యి అక్కడ కూడా వందకోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం విశేషం. ఆ మాటకొస్తే ఒక్క హిందీ లోనే, అనువాదమైన అన్ని ప్రపంచ భాషల్లో బాహుబలి తన సత్తా చాటుకుంది.
అందుకే డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా హక్కులను ఎంత భారీ మొత్తానికైనా కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే తమిళ్ హక్కులను 45 కోట్ల భారీ మొత్తానికి అమ్ముడయ్యాయి. కేవలం తమిళ హక్కుల ద్వారానే 45 కోట్లు వస్తే, విడుదలకు ముందే అన్ని హక్కులు అమ్మేసుకుంటే రెండొందల కోట్ల దాకా బిజినెస్ అవుతుందని అంచనా. 
ఇక బాహుబలి: ది కంక్లూషన్ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో, ఆర్ట్ డైరెక్టర్ సబు సైరిల్ కొత్తగా వేసిన సెట్ లో జరుగుతుంది. వచ్చే వేసవికి సినిమా విడుదల ఉంటుంది.