ప్రభాస్ ఫ్యాన్స్ కు హీరోయిన్ వార్నింగ్..!

ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించింది. సినిమా రిలీజ్ ప్రమోషన్స్ లో శ్రద్ధా కపూర్ ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటుగా సిని ప్రేక్షకులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. పైరసీని ప్రోత్సహించకండి.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కోసం తామంతా చాలా కష్టపడ్డామని.. రెప్పపాటులో ఈ సినిమా పూర్తికాలేదని శ్రద్ధా కపూర్ తన ఇన్ స్టాగ్రాం లో పోస్ట్ చేశారు.        

చిత్రయూనిట్ ఎన్నో ఏళ్ల కష్టమే మా ఈ చిత్రం.. మీ ప్రేమాభిమానాల కోసం మేము కష్టాలను ఎదుర్కుంటాం.. ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్.. సాహో మీద అవాస్తవాలను ప్రచారం చేయకండి.. దగ్గర్లో ఉన్న థియేటర్లో సినిమా చూడడని శ్రద్ధా కపూర్ కోరింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన శ్రద్ధా కపూర్ మొదటిసారి తెలుగు సినిమాలో నటించింది. ఈరోజు రిలీజైన సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.