నో డౌట్.. అనుకున్న డేట్ కే సైరా

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సైరా నరసింహా రెడ్డి సినిమా అక్టోబర్ 2న రిలీజ్ ఫిక్స్ చేశారు. సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రాం చరణ్ నిర్మిస్తున్నారు. చరిత్ర మరచిన స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథతో సైరా నరసింహా రెడ్డి తెరకెక్కింది. ఇక ఈ సినిమా రిలీజ్ పై రెండు రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి. సైరా అనుకున్న డేట్ కు రావడం కష్టమని అక్టోబర్ 8, 9 తారీఖులకు వాయిదా పడుతుందని వార్తలు వచ్చాయి.       

అయితే ఈ వార్తలకు సైరా నిర్మాత రాం చరణ్ ఆన్సర్ ఇచ్చారు. సైరా అనుకున్న టైం కు రిలీజ్ కన్ఫాం అని.. దానిలో డౌట్ పడాల్సిన అవసరం లేదని అన్నారు రాం చరణ్. సూళ్లూరుపేటలో ప్రభాస్ థియేటర్ వి ఎపిక్ ఓపెనింగ్ కు గెస్ట్ గా వెళ్లాడు రాం చరణ్. అక్కడ సాహో సినిమా బాగుంటుందని బాగా ఆడాలని అన్నారు చరణ్. ఇక సైరా సినిమా అనుకున్న టైం కు వస్తుందని పోస్ట్ పోన్ వార్తలను నమ్మొద్దని అన్నారు.