బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ గా హాట్ బ్యూటీ

బిగ్ బాస్ సీజన్ 3కి కావాల్సినంత స్పైసీ ఉండేలా ప్లాన్ చేశారు నిర్వాహకులు. కింగ్ నాగార్జున హోస్ట్ గా నిర్వహిస్తున్న ఈ సీజన్ లో ఇప్పటికే 15 మంది కంటెస్టంట్స్ పాల్గొన్న ఈ సీజన్ లో వాళ్లు సరిపోరు అన్నట్టుగా వైల్డ్ కార్డ్ గా కూడా హాట్ బ్యూటీని పంపించే స్కెచ్ వేశారు నిర్వాహకులు. అసలైతే వార్తల్లో హెబ్భా పటేల్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ వార్తల్లో ఉండగా ఆమె ప్లేస్ లో శ్రద్ధా దాస్ ను హౌజ్ లోకి పంపిస్తున్నారట. 

హీరోయిన్ గా ఒకటి రెండు సినిమాల్లో తళుక్కున మెరిసిన శ్రద్ధ దాస్ ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్, స్పెషల్ రోల్స్ చేస్తూ వచ్చింది. కెరియర్ ఎలాగు అటకెక్కినట్టు అనిపిస్తున్న ఈ టైంలో బిగ్ బాస్ షోతో మళ్లీ ఫాంలోకి రావాలని చూస్తుంది అమ్మడు. అయితే బిగ్ బాస్ ఈ వారమే మొదలైంది.. ఒకటి రెండు ఎలిమినేషన్స్ పూర్తయ్యాక కాని వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండొచ్చు. మరి బిగ్ బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీగా శ్రద్ధా దాస్ కన్ఫామా కాదా అన్నది చూడాలి.