
కింగ్ నాగార్జున నటించిన సూపర్ హిట్ మూవీ మన్మథుడుకి సీక్వల్ గా వస్తున్న సినిమా మన్మథుడు 2. రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాగ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జోడీ కడుతుంది. కీర్తి సురేష్, సమంత వంటి స్టార్స్ గెస్ట్ అప్పియరెన్స్ కూడా ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఆగష్టు 9న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొడుతుంది. ఇప్పటికే డిజిటల్ రైట్స్ లో 7.4 కోట్లకు అమ్ముడైన మన్మథుడు 2 శాటిలైట్ రైట్స్ లో సత్తా చాటింది.
ఇక ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా 8.3 కోట్లకు దక్కించుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నాగార్జున నిర్మిస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ తోనే ప్రాఫిట్స్ తెచ్చుకుంది. డిజిటల్, శాటిలైట్ రైట్స్ మాత్రమే కాదు హింది డబ్బింగ్ రైట్స్ కూడా 6 కోట్లకు అమ్మేశారట. ఇక థియేట్రికల్ రైట్స్ ఎలా సేఫ్ గా ఇచ్చేస్తారు. ఎలా లేదన్నా మన్మథుడు సీక్వల్ గా వస్తున్న ఈ సినిమాతో నాగార్జున నిర్మాతగా కూడా లాభపడ్డట్టే అంటున్నారు.