
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న సినిమా ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. హారిక హాసిని క్రియేషన్స్ తో పాటుగ గీతా ఆర్ట్స్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగమవుతుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో సుశాంత్, నివేదా పేతురాజ్ కూడా నటిస్తున్నారని తెలిసిందే. సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ లో సీనియర్ హీరోయిన్ టబు కూడా నటిస్తుందని తెలుస్తుంది.
తండ్రి కొడుకుల సెంటిమెంట్ తో వస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా నాన్న నేను అని పెట్టబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ గా అలకనంద, నాన్న నేను ప్రచారంలో ఉండగా ఇప్పుడు నాన్న నేను టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత త్రివిక్రం, అల్లు అర్జున్ హ్యాట్రిక్ మూవీగా ఈ సినిమా వస్తుంది. 2020 సంక్రాంతి టార్గెట్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.