ఆది సాయికుమార్ 'జోడీ' టీజర్

సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ హీరోగా నిలబడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడు. ఈమధ్యనే బుర్రకథ అంటూ వచ్చిన ఈ హీరో ఆ సినిమా నిరాశపరచడంతో మరో ప్రయత్నంగా జోడీ సినిమాతో వస్తున్నాడు. విశ్వనాథ్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది. నీవే ఆల్బం తో సంగీత ప్రియలను అలరించిన ఫణి కళ్యాణ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను పద్మజ సాయి వెంకటేష్ నిర్మిస్తున్నారు.

ఈ సినిమా టీజర్ ఈరోజు రిలీజ్ చేశారు. నిమిషం కన్నా తక్కువ నిడివి ఉన్న ఈ టీజర్ లో హీరో కేవలం హీరోయిన్ ను పడేయడానికి ట్రై చేస్తున్నాడు. టీజర్ ఇంప్రెస్ చేయగా కచ్చితంగా ఆది సాయి కుమార్ జోడీతో హిట్ కొట్టేలా ఉన్నాడు. యువ హీరోలంతా వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న ఈ టైంలో ఆది సాయి కుమార్ జోడీ ఈసారి అదరగొట్టడం ఖాయమని అంటున్నారు. జెర్సీ సినిమాతో హీరోయిన్ గా అలరించిన శ్రద్ధ శ్రీనాథ్ ఈ సినిమాలో గ్లామర్ గా కనిపిస్తుంది. మరి ఆది, శ్రద్ధ శ్రీనాథ్ ల జోడీ ప్రేక్షకులను మెప్పిస్తుందో లేదో చూడాలి.