
హీరోగా చేశాడు, అవుట్ డేటెడ్ అయిపోయాడు, డైరెక్టర్ గా చేశాడు, ప్రజలు భరించలేకపోయారు, చివరికి పెళ్లి చేసుకుంటానన్నాడు, ఇప్పుడు ఎవరెవరా అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఆయన మరెవరో కాదు, రెండు దశాబ్దాలు మించిన కెరీర్ ఉన్న హీరో కమ్ దర్శకుడు జెడీ చక్రవర్తి. రామ్ గోపాల్ వర్మని గురువు గా భావించే ఎంతోమందిలో జెడీ కూడా ఒకరు. చివరికి ఆ గురువు గారి సినిమాలో చేసిన హీరోయిన్ నే మనోడు పెళ్లి చేసుకోబోతున్నాడు.
షూటింగ్ పూర్తయినా కూడా విడుదలవ్వని ఆర్జీవీ సినిమాలలో, ఎక్స్ పోసింగ్ మూలాన కాస్తో కూస్తో ఆసక్తి రేకెత్తించిన సినిమా శ్రీదేవి. ఆ సినిమా విడుదలవకపోయినా, అందులోని హీరోయిన్ అనుకృతి జేడీకి విపరీతంగా నచ్చి, ఆ జన్మ బ్రహ్మచారి లా ఉండాలనుకున్నోడు పెళ్ళికి సిద్ధమయ్యాడు. శ్రీదేవి సినిమా షూటింగ్ సమయంలో డైరెక్షన్ టీమ్ లో జేడీ కూడా ఉండడంతో, అనుకృతి తో పరిచయం పెరగడం, అది కాస్త ప్రేమగా మారడం జరిగింది. ఇక ఆలస్యమెందుకు, త్వరలోనే పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకొని బ్రహ్మచారి జీవితానికి స్వస్తి పలకవయ్యా , గడ్డం సుందరాంగుడ.