మహర్షి పాలపిట్ట సాంగ్.. దేవి అదరగొట్టాడు..!

సూపర్ స్టార్ మహేష్ మహర్షి సినిమా మే 9న రిలీజ్ ప్లాన్ చేశారు. వంశీ పైడిపల్లి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ మొదలు పెట్టారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి మరో పాట రిలీజ్ చేశారు. కొద్దిగంటల క్రితం రిలీజైన పాలపిట్ట ఫోక్ సాంగ్ మహేష్ ఫ్యాన్స్ ను మాత్రమే కాదు సంగీత ప్రియులను అలరిస్తుంది. ఇప్పటికే ప్రచార చిత్రాలు మహర్షి సినిమాపై భారీ అంచనాలు ఏర్పడేలా చేశాయి.

పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. మహేష్ కూడా ఈ సినిమాలో స్టూడెంట్ గా.. కంపెనీ సిఈవోగా.. రైతుగా మూడు డిఫరెంట్ రోల్స్ లో కనిపిస్తాడని తెలుస్తుంది. మొదటి రెండు సాంగ్స్ దేవి మార్క్ కనిపించకున్నా పదర పదరా, పాలపిట్ట సాంగ్ డిఎస్పి అదరగొట్టాడు. మరి మహేష్ మహర్షి సంచలనాలు ఎలా ఉంటాయో తెలియాలంటే మే 9 వరకు వెయిట్ చేయాల్సిందే.