నాని.. ఇంద్రగంటి.. 'వి'

వరుసగా ఆరు సక్సెస్ లను అందుకున్న నాచురల్ స్టార్ నాని లాస్ట్ ఇయర్ కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ సినిమాలు నిరాశ పరచడంతో ఈ ఇయర్ సినిమాల విషయంలో జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పటికే రిలీజైన జెర్సీ నాని ఖాతాలో సూపర్ డూపర్ హిట్ నిలవగా.. సెట్స్ మీద ఉన్న విక్రం కుమార్ గ్యాంగ్ లీడర్ సినిమాను ప్రేక్షకులను మెప్పించేలా తెరకెక్కిస్తున్నారట. ఇదిలాఉంటే నాని ఇంద్రగంటి మోహనకృష్ణ డైరక్షన్ లో ఓ సినిమా రానుందని తెలిసిందే.

నానిని హీరో చేసిన ఇంద్రగంటి మోహనకృష్ణ అష్టా చెమ్మ తర్వాత జెంటిల్ మెన్ సినిమా కూడా చేశాడు. రెండు సినిమాలు సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇక రాబోతున్న హ్యాట్రిక్ మూవీ కూడా ప్రయోగాత్మకంగా ఉంటుందట. సినిమాలో నాని నెగటివ్ రోల్ చేస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు టైటిల్ గా వి అని పెట్టబోతున్నారట. వి ఫర్ విక్టరీనా లేక వి ఫర్ విలనా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది.