నిఖిల్ సినిమాకు హాలీవుడ్ సినిమా దెబ్బ..!

యువ హీరో నిఖిల్ లీడ్ రోల్ చేస్తూ టి.ఎన్ సంతోష్ డైరక్షన్ లో వస్తున్న సినిమా అర్జున్ సురవరం. నిఖిల్ సరసన లావణ్య త్రిపాటి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా మే 1న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఇంతకు ముందే రిలీజ్ వాయిదా పడిన అర్జున్ సురవరం మే 1న కూడా రావడం కష్టమని అంటున్నారు. అదెలా అంటే ఈ వారం ఎవెంజర్స్ ఎండ్ గేం రిలీజ్ అవుతుంది. హాలీవుడ్ సినిమానే అయినా తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమాపై బజ్ బాగుంది.

ఆల్రెడీ ఆన్ లైన్ బుకింగ్స్ లో భారీగా ఉన్నాయి. ఇలాంటి టైంలో మే 1న అర్జున్ సురవరం వస్తే ఓపెనింగ్స్ పెద్దగా వచ్చే అవకాశం ఉండదని చిత్రయూనిట్ ఫీలింగ్. అందుకే మరోసారి ఈ సినిమాను వాయిదా వేస్తున్నారని తెలుస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ సీత పరిస్థితి కూడా ఇదేలా ఉంది. ముందు సీతని ఏప్రిల్ 26 రిలీజ్ అనుకున్నా ఎవెంజర్స్ ఎండ్ గేం తాకిడికి తట్టుకోవడం కష్టమని భావించి సినిమా మే రెండో వారానికి పోస్ట్ పోన్ చేసుకున్నారు. అర్జున్ సురవరం కూడా మే రెండో వారం కాని మూడవ వారం కూడా చెప్పొచ్చు.