చదువంటే మార్కుల షీటు మీద నెంబర్లు కాదు..!

తెలంగాణాలో ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యం వల్ల ఫలితాల్లో తప్పులు దొర్లాయి. ఫెయిల్ అయిన కొంతమంది విద్యార్ధులు ఆత్మహత్యలు చేసుకున్నారు. దీనికి సంబందించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా విద్యార్ధి సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. అయితే విద్యార్ధుల మనోస్థైర్యం కోల్పోకుండా సెలబ్రిటీస్ కూడా ట్వీట్స్ చేస్తున్నారు. నిన్న రామ్ పోతినేని ఇంటర్ పూర్తి చేయని సచిన్ దేశం గర్వించే ఆటగాడు అయ్యాడని సచిన్ బర్త్ డే నాడు ట్వీట్ చేశాడు.   

లేటెస్ట్ గా నాని కూడా ఈ ఇష్యూ మీద స్పందించాడు. చదువంటే నేర్చుకోవడం మాత్రమే.. మార్కుల షీటు మీద నంబర్లు కాదని అన్నారు. మీరు అనుకున్నదాన్ని సాధించలేకపోయినప్పుడు మళ్లీ ప్రయత్నించండి.. పోరాడండి.. మీ ప్రయత్నం వృథాగా పోదు అని ట్వీట్ చేశాడు. వీటన్నికన్నా జీవితం ఎంతో విలువైనంది. మీ తల్లిదండ్రులు, మిమంలని ప్రేమించే వారి గురించి ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంటర్మీడియట్ ఫలితాలను చూసి వారు మిమ్మల్ని ప్రేమించరు. కేవలం మిమ్మల్ని మాత్రమే ప్రేమిస్తారు అంటూ నాని ట్విట్టర్ లో పెట్టాడు.