
సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. అల్లరి నరేష్ కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడని తెలిసిందే. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ కాగా ఈరోజు పదర పదర పదరా అంటూ ఓ సూపర్ సాంగ్ రిలీజైంది.
దేవి మార్క్ మ్యూజిక్ తో వచ్చిన ఈ సాంగ్ కు శ్రీమణి సాహిత్యం అందించగా శంకర్ మహదేవన్ ఈ సాంగ్ పాడటం జరిగింది. సినిమాలో చాలా ప్రాధాన్యత ఉన్న సాంగ్ గా అనిపిస్తున్న ఈ పాట చాలా స్పూర్తిదాయకంగా ఉంది. దేవి మ్యూజిక్ జస్ట్ ఓకే అనేలా ఉన్నా శ్రీమణి అందించిన లిరిక్స్ మాత్రం అద్భుతంగా ఉన్నాయి. మే 9న మహర్షి రిలీజ్ ప్లాన్ చేశారు. భరత్ అనే నేను తర్వాత మహేష్ నటించిన ఈ సినిమా అంచనాలు భారీగా ఉండగా సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.