జెర్సీ డైరక్టర్ తో వరుణ్ తేజ్.. దిల్ రాజు ప్లానే వేరబ్బా..!

మళ్లీ రావా సినిమాతో పర్వాలేదు అనిపించుకున్న గౌతం తిన్ననూరి రీసెంట్ గా నాని జెర్సీ సినిమాతో సంచలన విజయం అందుకున్నాడు. సినిమా వసూళ్ల లెక్క ఎలా ఉన్నా దర్శకుడిగా గౌతం గెలిచాడని చెప్పొచ్చు. అర్జున్ పాత్రలో నాని అద్భుత నటన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాతో తన ప్రతిభ చాటిన గౌతం తిన్ననూరికి దిల్ రాజు ఛాన్స్ ఇచ్చాడని తెలుస్తుంది.

హిట్టు కొట్టిన డైరక్టర్ పై ఖర్చీఫ్ వేయడం దిల్ రాజుకి కొత్తేమి కాదు జెర్సీ హిట్ టాక్ రావడమే ఆలస్యం. జెర్సీ టీం కు ఓ అభినందన సభ ఏర్పాటు చేసి డైరక్టర్ ను లాక్ చేసినట్టు తెలుస్తుంది. దిల్ రాజు బ్యానర్ లో వరుణ్ తేజ్ హీరోగా గౌతం తిన్ననూరి థర్డ్ ఫిల్మ్ ఉంటుందట. ఇప్పటికే స్టోరీ లైన్ ఫైనల్ అయ్యిందట. వరుణ్ తేజ్ వాల్మీకి పూర్తి కాగానే ఈ సినిమా పట్టాలెక్కుతుందని అంటున్నారు. ఫిదా, ఎఫ్-2 తర్వాత వరుణ్ తేజ్, దిల్ రాజుల హ్యాట్రిక్ కాంబోగా ఈ మూవీ రాబోతుంది.