తెలుగు పరిశ్రమకు బిసిసిఐ దిల్ రాజు..!

నాని, గౌతం తిన్ననూరి కాంబినేషన్ లో లాస్ట్ ఫ్రైడే రిలీజైన జెర్సీ సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. నాని సహజ నటనతో పాటుగా గౌతం తిన్ననూరి డైరక్షన్ టాలెంట్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ అందుకుంది. వసూళ్లు కూడా బాగానే ఉన్నాయని తెలుస్తుంది. ఇక ఈ సినిమా చూసిన దిల్ రాజు స్పెషల్ గా అప్రిసియేషన్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమంలో మాట్లాడిన నాని దిల్ రాజు తెలుగు పరిశ్రకు బిసిసిఐ లాంటి వారని అన్నాడు. రిలీజ్ నాడు ఉదయం 9 గంటల లోపు దిల్ రాజు దగ్గర నుండి ఫోన్ వస్తే సినిమా హిట్ అన్నట్టే. జెర్సీలో అర్జున్ పాత్రకు బిసిసిఐ అభినందన సభ ఏర్పాటు చేసినట్టు జెర్సీ సినిమా గురించి దిల్ రాజు అప్రిసియేషన్ ఈవెంట్ ప్లాన్ చేశారు. ఈ కథ విన్నప్పుడే అద్భుతంగా అనిపించిందని సినిమా సక్సెస్ పట్ల తాను ముందునుండి నమ్మకంగా ఉన్నట్టు చెప్పుకొచ్చాడు నాని.