
అత్యంత భారీ అంచనాలతో, బాహుబలిని ఢీ కొట్టే చిత్రమంటూ ప్రచారం లో ఉండి, భారీ హంగామా మధ్య విడుదలైన, కబాలి సినిమా అంచనాలను అందుకోలేకపోయింది. రజినీ అభిమానులను దృష్టిలో ఉంచుకోకుండా, మొదటి పావు గంట తర్వాత, దర్శకుడు రంజిత్, సినిమాని రకరకాల మలుపులు తిప్పడంతో, సినిమా చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
అయితే వీకెండ్ కాబట్టి, టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడవడంతో, ఈ మూడు రోజులకి కలెక్షన్లకు ధోఖా ఉండదు అని అంచనా. అయితే సినిమాకి ఖర్చు బాగా పెట్టడంతో, అంత మొత్తం ఈ మూడు రోజుల్లో రాబట్టడం ఎంతవరకు కుదురుతుంది అనేది ప్రశ్న. కాబట్టి, లింగా సినిమా ఫ్లాప్ అయ్యాక, డిస్ట్రిబ్యూటర్ల నుండి, పేమెంట్ ఇమ్మంటూ విపరీతమైన ఒత్తిడి కి లోనైన రజినీ, కబాలి విషయంలో కూడా, మళ్లీ అలా చిక్కుల్లో పడబోతున్నారా లేదా అనేది చూడాలంటే, సోమవారం నుండి సినిమా ఎలా ఆడుతుందో గమనించాలి.