ఎంపిగా గెలిచినా సరే జబర్దస్త్ వదలడట..!

మెగా బ్రదర్ నాగబాబు ఓ పక్క సినిమాలు చేస్తూనే జబర్దస్త్ షోకి జడ్జ్ గా ఉంటున్నారు. ఐదేళ్లుగా బుల్లితెర మీద నవ్వులు పూయిస్తున్న జబర్దస్త్ షో కొందరికి నచ్చకపోయినా ఆ షో మాత్రం టి.ఆర్.పి రేటింగ్స్ లో అదరగొడుతుంది. ఇక రీసెంట్ గా జరిగిన ఏపి ఎలక్షన్స్ లో జనసేన తరపున నరసాపురం ఎంపి అభ్యర్ధిగా బరిలో దిగారు నాగబాబు, ఆయన కోసం వరుణ్ తేజ్, నిహారిక ప్రచారంలో పాల్గొన్నారు. వారే కాదు జబర్దస్త్ టీం మొత్తం వచ్చి నాగబాబుకి సపోర్ట్ గా ప్రచారం చేశారు. 

అయితే ఎంపిగా గెలిస్తే సినిమాలను పూర్తిగా ఆపేస్తా అని చెబుతున్న నాగబాబు జబర్దస్త్ షో మాత్రం వదిలేదు లేదని చెబుతున్నాడు. జబర్దస్త్ షో వదిలేసే ఆలోచన తనకి ఉన్నా ప్రేక్షకులు ఎక్కడకు వెళ్లినా సరే మీరు ఆ షోని వదలొద్దని అంటున్నారు. ఇక ప్రేక్షకుల కోరిక మేరకు జబర్దస్త్ షో తప్పక చేస్తా అని అంటున్నాడు నాగబాబు.