ఓవర్సీస్ లో మహర్షి డీల్ క్లోజ్..!

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా మహర్షి. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. మే 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అదరగొడుతుంది. ఓవర్సీస్ లో మహర్షి సినిమా 12.50 కోట్లకు కొన్నారట. ఇప్పటికే జెమిని వారు శాటిలైట్ రూపంలో 16 కోట్ల దాకా కోట్ చేయగా లేటెస్ట్ గా ఓవర్సీస్ రైట్స్ కూడా మహర్షి మీద అంచనాలు పెంచాయి. 

తెలుగు సినిమాలు ఈమధ్య ఓవర్సీస్ లో బొక్క బోర్లా పడుతున్నాయ్. అందుకే తెలుగు సినిమాల మీద ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కాస్త వెనుకడుగు వేస్తునారు. అయితే మహర్షి టీజర్ 24 గంటల్లో 12 మిలియన్ వ్యూస్ రాబట్టింది అంటే కచ్చితంగా ఈ సినిమాపై ఆడియెన్స్ హోప్ ఏ రేంజ్ లో ఉంటాయో తెలుస్తుంది.