కబీర్ సింగ్ టీజర్ పై అర్జున్ రెడ్డి ఏమన్నాడంటే..!

విజయ్ దేవరకొండకు స్టార్ స్టేటస్ తెచ్చి పెట్టిన అర్జున్ రెడ్డి సినిమా బాలీవుడ్ లో షాహిద్ కపూర్ రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. మాత్రుక దర్శకుడు సందీప్ వంగ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. బాలీవుడ్ అర్జున్ రెడ్డి సినిమాకు కబీర్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. షాహిద్ కపూర్ కు జోడీగా కియరా అద్వాని ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.

కబీర్ సింగ్ టీజర్ సోమవారం రిలీజ్ అవగా ఆ సినిమా టీజర్ పై లేటుగా లేటెస్ట్ గా స్పందించాడు విజయ్ దేవరకొండ. కబీర్ సింగ్ కు బా బెస్ట్ విషెష్ అందిస్తున్నా అంటూ విజయ్ దేవరకొండ ట్వీట్ చేశాడు. అర్జున్ రెడ్డి తరహాలోనే కబీర్ సింగ్ టీజర్ టీజర్ మక్కీకి మక్కీ దించాడన్న కామెంట్స్ వస్తున్నా విజయ్ స్థానంలో షాహిద్ కపూర్ కూడా అదరగొట్టాడని చెప్పొచ్చు. మరి హింది అర్జున్ రెడ్డి అదేనండి కబీర్ సింగ్ ఎలాంటి సత్తా చాటుతుందో చూడాలి.