
నిన్నుకోరి సినిమాతో దర్శకుడిగా ప్రతిభ చాటుకున్న శివ నిర్వాణ రెండో ప్రయత్నంగా చేసిన సినిమా మజిలీ. నాగ చైతన్య, సమంత జంటగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజై సూపర్ హిట్ అందుకుంది. ఈ సినిమా సక్సెస్ తో మరోసారి తన సత్తా చాటుకున్నాడు డైరక్టర్ శివ నిర్వాణ. చైతు కెరియర్ లో మజిలీ ఓ మైల్ స్టోన్ సినిమాగా నిలిచేలా వసూళ్లు ఉన్నాయి. సినిమాలో సమంత కూడా శ్రావణి పాత్రలో అదరగొట్టింది.
ఈ సినిమా సక్సెస్ జోష్ లో ఉన్న శివ తన తర్వాత సినిమా డ్యాషింగ్ హీరో రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో చేయాలని చూస్తున్నాడట. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాలతో విజయ్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో తెలిసిందే. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ తర్వాత క్రాంతి మాధవ్ డైరక్షన్ లో ఓ సినిమా.. ఆనంద్ అన్నామలై డైరక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది. మరి శివ విజయ్ కాంబో సెట్ అవ్వాలంటే కచ్చితంగా ఇంకాస్త టైం పట్టేట్టు ఉంది.