
సూపర్ స్టార్ మహేష్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఓ చోట కలిస్తే ఆ కిక్కే వేరు. కలిసిన వాళ్ల కన్నా ఆ ఇద్దరు కలిసిన పిక్స్ బయటకు వస్తే ఆ స్టార్స్ ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ సంబరపడతారు. లేటెస్ట్ గా అలాంటి క్రేజీ మీటింగ్ ఒకటి జరిగింది. మహేష్, ఎన్.టి.ఆర్ వాళ్లిద్దరే కాదు వారి సతీమణులతో ఓ బర్త్ డే పార్టీలో అటెండ్ అయ్యారు. టాలీవుడ్ డైరక్టర్ వంశీ పైడిపల్లి భార్య మాలిని బర్త్ డే పార్టీకి మహేష్, తారక్ అటెండ్ అయ్యారు.
ఎన్.టి.ఆర్ తో బృందావనం సినిమా తీసిన వంశీ పైడిపల్లి ప్రస్తుతం మహేష్ తో మహర్షి చేస్తున్నాడు. మహేష్, తారక్ రాకతో మాలిని బర్త్ డే పార్టీ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది. అంతేకాదు ఆ పార్టీలో స్టార్స్ అంతా కలిసి దిగిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మహేష్ భార్య నమ్రత మహేష్, ఎన్.టి.ఆర్ దిగిన పిక్స్ తన ట్విట్టర్ లో షేర్ చేసింది. మొత్తానికి మహేష్, తారక్ తన ఫ్రెండ్ షిప్ తో ఫ్యాన్స్ కు మంచి మెసేజ్ ఇస్తున్నారని చెప్పొచ్చు.