
టైటిల్ చూసి కచ్చితంగా హీరో సూర్య రజిని మీద అభిమానం కొద్ది విలన్ గా చేయాలని ఫిక్స్ అయ్యాడని అనుకోవచ్చు. రజినికాంత్ విలన్ గా సూర్య నటించేది నిజమే కాని అది కోలీవుడ్ హీరో సూర్య కాదు యాక్టర్ టర్నెడ్ డైరక్టర్ ఎస్.జె. సూర్య. డైరక్టర్ గా సూపర్ హిట్లు అందుకున్న ఎస్.జె. సూర్య యాక్టర్ గా మారి ముందు హీరోగా సొంత ప్రయత్నాలు చేసినా ఇప్పుడు విలన్ గా వరుస అవకాశాలు అందుకుంటున్నాడు.
తెలుగులో మురుగదాస్ డైరక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ హీరోగా వచ్చిన స్పైడర్ సినిమాలో విలన్ గా నటించిన ఎస్.జె సూర్య తమిళంలో కూడా విజయ్ హీరోగా వచ్చిన మెర్సల్ సినిమాలో విలన్ గా నటించి మెప్పించాడు. ఇప్పుడు మురుగదాస్ డైరక్షన్ లో సూపర్ స్టార్ రజిని హీరోగా చేస్తున్న సినిమాలో కూడా విలన్ గా ఛాన్స్ కొట్టేశాడట. ఈ సినిమాలో రజిని వర్సెస్ సూర్య ఫైటింగ్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాలో రజినికాంత్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడని అంటున్నారు. కీర్తి సురేష్, నయనతార ఈ మూవీలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.