
మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్, రెజినాల మధ్య లవ్ ట్రాక్ నడించిందని పెళ్లి దాకా వెళ్లిన వీరి ప్రేమకు సడెన్ గా ఫుల్ స్టాప్ పడ్డదన్న వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. సాయి ధరం తేజ్, రెజినా ఇద్దరు ఆ వార్తలను ఖండించుకుంటూ వస్తున్నా అవి ఇంకా పెరుగుతూ వచ్చాయి. సాయి ధరం తేజ్, రెజినా ఇద్దరు కలిసి పిల్లా నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాల్లో కలిసి నటించారు. అయితే కొన్నాళ్లుగా వీరి కాంబినేషన్ లో సినిమాలు రావట్లేదు. అందుకే సాయి తేజ్, రెజినాలు బ్రేకప్ చేసుకున్నారని అన్నారు.
లేటెస్ట్ గా ఈ వార్తలపై చిత్రలహరి ఇంటర్వ్యూస్ లో స్పందించాడు సాయి తేజ్. రెజినా తను కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని అంతకుమించి తమ మధ్య ఏం లేదని అన్నారు. అయితే ఇదే విషయంపై రెజినా కూడా నోరు విప్పింది. మీరంతా అనుకున్నట్టుగా ఏమి కాదని.. ఒకవేళ తన జీవితంలో అలాంటిదేమైనా జరిగితే ముందు మీకే చెబుతా అంటుంది రెజినా. ప్రస్తుతం తను ప్రేమిస్తుంది తన వృత్తిని మాత్రమే అని.. తనకి ఇంత అద్భుతమైన జీవితం ఇచ్చిన వారికి తన ప్రేమ గురించి ముందు చెబుతానని అంటుంది రెజినా.