మహేష్ 'మహర్షి' టీజర్.. గెలవడం నాకు అలవాటే..!

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో మహేష్ 25వ సినిమగా రాబోతున్న మహర్షి సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించబడుతుంది. మే 9న రిలీజ్ అవుతున్న ఈ సినిమా టీజర్ ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా రిలీజ్ చేశారు. మహేష్ స్టైల్ లుక్ తో పాటుగా భారీ డైలాగ్స్ తో ఈ టీజర్ అదిరిపోయింది. 


ముఖ్యంగా సక్సెస్ ఈజ్ నాట్ ఏ డెస్టినేషన్.. సక్సెస్ ఈజ్ ఏ జర్నీ అని మహేష్ చెప్పడం.. ఓడిపోతావ్ అంటే గెలిచి చూపించడం నాకు అలవాటని డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. మహర్షి అనే సాఫ్ట్ టైటిల్ పెట్టినా సినిమాలో యాక్షన్ సీక్వెన్సెస్ కు ఏమి లోటు లేదని టీజర్ చూస్తేనే అర్ధమవుతుంది. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న మహర్షి సినిమాలో అల్లరి నరేష్ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు.