మజిలీ ఫస్ట్ రివ్యూ

అక్కినేని నాగ చైతన్య, సమంత జంటగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా మజిలీ. నిన్నుకోరి తర్వాత మళ్లీ అలాంటి ఎమోషనల్ మూవీతోనే ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శివ నిర్వాణ. షైన్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్లో హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మించారు. గోపి సుందర్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాకు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.

శుక్రవారం రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు అక్కినేని ఫ్యామిలీ హీరో సుశాంత్ అప్పుడే రివ్యూ ఇచ్చేశాడు. ఫ్యామిలీతో స్పెషల్ స్క్రీనింగ్ లో సినిమా చూసిన సుశాంత్ సినిమా మీద ప్రశంసలు కురిపించాడు. అందమైన కథను చాలా సున్నితంగా డీల్ చేశారని.. లవ్ అండ్ పెయిన్ రెండిటిని బాగా ఆస్వాధించానని అన్నారు సుశాంత్. సినిమాలో నాగ చైతన్య, సమంతలు పాత్రలకు ప్రాణం పోశారు. దివ్యాన్ష కౌశైక్ మొదటి సినిమానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిందని అన్నారు. సినిమా మ్యూజిక్ బాగుందని మిగతా పాత్రదారులు బాగా చేశారని. మజిలీ సినిమా ఓ బ్యూటిఫుల్ ఎక్స్ పీరియన్స్ అని ట్వీట్ చేశారు సుశాంత్.