ఉగాది నాడు మహేష్ సర్ ప్రైజ్..!

సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న మహర్షి సినిమా మే 9న గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేశారు. ఇప్పటివరకు చిన్న ఫస్ట్ లుక్ టీజర్ మాత్రమే వదిలిన మహర్షి నుండి ఓ టీజర్ రాబోతుంది. శనివారం ఉగాది సందర్భంగా మహేష్ మహర్షి టీజర్ రిలీజ్ చేస్తున్నారట. ఈ టీజర్ లో రెండు భారీ డైలాగ్స్ కూడా ఉంటాయని తెలుస్తుంది. మహేష్ 25వ సినిమాగా మహర్షి ఎంతో ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ అయ్యింది.

సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దె నటిస్తుండగా అల్లరి నరేష్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాడు. ఉగాది రోజున మహర్షి టీజర్ తో సర్ ప్రైజ్ చేస్తాదట. ఇప్పటివరకు సినిమా గురించి ఎలాంటి క్లూ వదలని మహేష్ సినిమాతో మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.