తమిళ హీరోని అరెస్ట్ చేయాలని డిమాండ్..!

కోలీవుడ్ లో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయ్ సేతుపతి లేటెస్ట్ గా సూపర్ డీలక్స్ సినిమాలో నటించాడు. మార్చి చివరి వారంలో రిలీజైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. విజయ్ సేతుపతి, సమంత, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలుగా నటించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి హిజ్రాగా నటించి మెప్పించాడు. తన నటనతో మెప్పించిన విజయ్ హిజ్రాలను కించపరచాడని అతని మీద గొడవకు దిగారు ట్రాన్స్ జెండర్స్.


సినిమాలో తమని కించపరచేలా సన్నివేశాలు ఉన్నాయని.. పిల్లలను కిడ్నాప్ చేసే వ్యతులుగా తమని చూపి తమ మనోభావాలు దెబ్బతీశారని హిజ్రా సంఘాలు సూపర్ డీలక్స్ సినిమాపై వివాదం సృష్టిస్తున్నారు. అంతేకాదు ఆ సినిమా దర్శకుడు త్యాగరాజన్ కుమార్ రాజా, హీరో విజయ్ సేతుపతిలను వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ వివాదంపై విజయ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.