ప్రభాస్ తో సమంత.. ఛాన్స్ ఉందంటారా..?

అక్కినేని కోడలుగా మారిన సమంత పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తుంది. తెలుగు, తమిళ భాషల్లో అందరి స్టార్స్ తో నటించిన సమంత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మాత్రం స్క్రీన్ షేర్ చేసుకోలేదు. అయితే ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తుంది. బాహుబలి తర్వాత ప్రభాస్ సాహో సినిమా చేస్తున్నాడు. సుజిత్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా తర్వాత రాధాకృష్ణ డైరక్షన్ లో జాన్ సినిమా చేస్తున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత దిల్ రాజు బ్యానర్ లో ప్రభాస్ ఓ సినిమా చేస్తాడని తెలుస్తుంది. ప్రభాస్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యే కథ ఉందట. దాన్ని కరెక్ట్ గా హ్యాండిల్ చేసే డైరక్టర్ కోసం వెతుకుతున్నారట. ఈ సినిమాలో ప్రభాస్ తో సమంతను తీసుకోవాలని చూస్తున్నారట. లైన్ విన్న ప్రభాస్ ఓకే చెప్పగా ఫుల్ స్క్రిప్ట్ తర్వాత సినిమా గురించి అఫిషియల్ గా ఎనౌన్స్ చేస్తారని తెలుస్తుంది.