
సూపర్ స్టార్ మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న సినిమా మహర్షి. దిల్ రాజు, అశ్వనిదత్, పివిపి కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని మొదటి సాంగ్ రిలీజైంది. ఇక బిజినెస్ లో కూడా మహర్షి అదరగొడుతున్నాడు. సినిమా శాటిలైట్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయట. జెమిని టివి మహేష్ మహర్షి శాటిలైట్ రైట్స్ ను 16.80 కోట్లకు కొన్నారట.
డిజిటల్ రైట్స్ ఆల్రెడీ 11 కోట్ల దాకా పలికాయని తెలుస్తుంది. థియేట్రికల్ బిజినెస్ తోనే మహర్షి 28 కోట్ల దాకా రాబట్టింది. అన్ని ఏరియాల్లో మహర్షికి మంచి బిజినెస్ డీల్స్ వస్తున్నాయట. ఎలా లేదన్నా 100 కోట్ల పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందని తెలుస్తుంది. మే 9న రిలీజ్ ప్లాన్ చేస్తున్న మహర్షి సినిమా మహేష్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని అంటున్నారు చిత్రయూనిట్.