
నీది నాది ఒకే కథ సినిమాతో ప్రేక్షకులను మెప్పించిన వేణు ఊడుగుల డైరక్షన్ లో వస్తున్న సినిమా విరాట పర్వం. ఈ సినిమాలో రానా నక్సలైట్ గా నటిస్తున్నాడని తెలుస్తుంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో టబు కూడా స్పెషల్ రోల్ లో కనిపిస్తుంది. విప్లవ భావాలు కలిగిన యువకుడు నక్సలైట్ గా మారి ఏం చేశాడన్న కథతో ఈ సినిమా వస్తుందట.
కెరియర్ లో ఎప్పుడూ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ యాక్టర్ గా రాణిస్తున్న రానా ఇక్కడే కాకుండా బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటుతున్నాడు. మరి నక్సలైట్ గా రానా ఎలా కనిపిస్తాడో చూడాలి. ఈ సినిమా తర్వాత రానా గుణశేఖర్ డైరక్షన్ లో హిరణ్యకశ్యప సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు.