స్టార్ హీరోకి అరెస్ట్ వారెంట్

కన్నడ స్టార్ హీరో సుదీప్ కు అసలేమాత్రం టైం కలిసి రావట్లేదు ఓ పక్క తను నటిస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడమే కాకుండా అతని మీద కోర్ట్ కేసు కూడా నడుస్తుంది. ఓ టివి షో కోసం సుదీప్ కాఫీ ఎస్టేట్ అద్దెకు తీసుకున్నాడట. 1 కోటి 80 లక్షలు అద్దె మాట్లాడుకోగా కేవలం 50 వేలు మాత్రమే ఇచ్చి అందులో షూటింగ్ మొదలు పెట్టారట. మిగిలిన డబ్బులు ఇవ్వకపోగా కాఫీ ఎస్టేట్ ఆస్తులు ధ్వంసం చేశారట.  

కాఫీ ఎస్టేట్ యజమాని దీపక్ పటేల్ చిక్ మంగుళూరు కోర్ట్ లో కేసు వేశాడు. రెండు మూడు వాయిదాలుగా కేసు నడుస్తున్నా ఒక్కదానికి సుదీప్ నుండి రెస్పాన్స్ రాలేదట. అందుకే కోర్టు వారు మే 22లోగా అతన్ని కోర్టులో హాజరు పరచాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సుదీప్ ఎక్కడ ఉన్నాడో ఆచూకీ లేదని అంటున్నారు. మరి స్టార్ ఇమేజ్ ఉన్న హీరో ఇలాంటి కేసులో ఇరుక్కుని ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదు. మరి ఇప్పటికైనా తప్పు తెలుసుకుని కోర్ట్ వారికి సహకరిస్తే మంచిది.