
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ గాయాలపాలయ్యారని తెలుస్తుంది. సుందర్ సి డైరక్షన్ లో ఓ మూవీ షూటింగ్ టర్కీలోని కప్పడోసియాలో జరుగుతుంది. భారీ యాక్షన్ సీక్వన్స్ చేస్తున్న టైంలో విశాల్ బైక్ ఛేజింగ్ సీన్ చిత్రీకరణలో ఈ యాక్సిడెంట్ జరిగిందని తెలుస్తుంది. వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్ కు తీసుకెళ్లారట. ఫస్ట్ ఎయిడ్ చేసి చేతికి, కాలుకి కట్టు వేసినట్టు తెలుస్తుంది.
ప్రసుతం విశాల్ చేతికి, కాలుకి కట్టు వేసిన పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న విశాల్ యాక్సిడెంట్ వార్త ఆయన ఫ్యాన్స్ ను షాక్ అయ్యేలా చేసింది. త్వరలోనే విశాల్ మళ్లీ మాములు మనిషి కావాలని ఆశిస్తున్నారు. ఈ సినిమాతో పాటుగా విశాల్ ఎన్.టి.ఆర్ టెంపర్ సినిమా తమిళ రీమేక్ చేస్తున్నాడు. అయోగ్య టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.