
తెలుగు, తమిళం అనే తేడా లేకుండా వరుస అవకాశాలను అందుకుంటున్న సాయి పల్లవి ఓ దర్శకుడి వల్లో పడిందని లేటెస్ట్ న్యూస్. కోలీవుడ్ డైరక్టర్ ఏ.ఎల్.విజయ్ ఆల్రెడీ అమలా పాల్ ను ప్రేమించి పెళ్లాడి కొన్ని కారణాల వల్ల వాళ్లిద్దరు విడిపోయారు. అయితే ఇప్పుడు సాయి పల్లవితో విజయ్ ప్రేమాయణం నడిపిస్తున్నాడు అన్నది కోలీవుడ్ లేటెస్ట్ రూమర్. అసలు నాకు పెళ్లే వద్దు అన్న సాయి పల్లవి ఎలా విజయ్ లవ్ లో పడ్డది అన్నది ఇక్కడ ఇంట్రెస్టింగ్ మ్యాటర్ అయ్యింది.
అయితే సాయి పల్లవి సన్నిహితులు మాత్రం అసలు ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదై చెప్పుకొచ్చారు. సాయి పల్లవి ఫ్యాన్స్ కూడా విజయ్ తో సాయి పల్లవిని లింక్ పెడుతూ వస్తున్న వార్తలను ఖండిస్తున్నారు. మళయాళ ప్రేమం సినిమాతో సత్తా చాటిన సాయి పల్లవి సౌత్ లో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. వరుస సినిమా ఛాన్సులు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ సాగిస్తున్న సాయి పల్లవిపై ఇలాంటి రూమర్స్ రావడం ఆశ్చర్యకరంగా ఉంది.