
మేడం టుస్సాడ్స్ సింగపూర్ వారు మహేష్ మైనపు బొమ్మ తయారు చేశారు. సింగపూర్ ఐఫా జోన్ లో మహేష్ స్టాట్యూని ప్రదర్శనలో ఉంచుతారు. లాస్ట్ ఇయర్ కొలతలు తీసుకున్న మేడం టుస్సాడ్స్ మ్యూజియం నిర్వాహకులు ఈరోజు హైదరాబాద్ లో ఏ.ఎం.బి సినిమాస్ లో మహేష్ స్టాట్యూ రివీల్ చేశారు. మేడం టుస్సాడ్స్ నిర్వాహకులతో పాటుగా మహేష్ కూడా ఈ స్టాట్యూ ప్రదర్శనలో అటెండ్ అయ్యారు.
అచ్చు గుద్దినట్టుగా మహేష్ లానే ఉన్న మహేష్ మైనపు బొమ్మను చూసి మహేష్ షాక్ అయ్యాడు. హైదరాబాద్ లో కొద్దిరోజులు ప్రదర్శనలో ఉండే మహేష్ మైనపు బొమ్మ త్వరలో సింగపూర్ కు వెళ్తుందట. సౌత్ నుండి ప్రభాస్ మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో స్థానం సంపాదించారు. ఆ తర్వాత మహేష్ బాబుకి ఆ లక్కీ ఛాన్స్ వచ్చింది. మహేష్ తో మహేష్ దిగిన సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.