మరోసారి తండ్రి కాబోతున్న అల్లు అర్జున్

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మళ్లీ తండ్రి కాబోతున్నాడు. అవును ఇది నిజం. స్వయంగా ఆయన ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అటు కెరీర్ పరంగా సక్సెస్‌ సినిమాలతో హ్యాపీగా ఉన్న బన్నీ.. ఇటు పర్సనల్ లైఫ్‌లోనూ గుడ్ న్యూస్‌తో హ్యాపీగా ఉన్నాడు. బన్నీ ఈ ఆనందాన్ని తన అభిమానులతో పంచుకున్నాడు. తమ కుటుంబంలోకి త్వరలోనే మరో కొత్త వ్యక్తి రాబోతున్నట్లు ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన భార్య స్నేహతో కలిసి దిగిన లేటెస్ట్ ఫోటోను ట్విట్టర్‌లో పెట్టాడు. 

రెండేళ్ల కిందట తాను తండ్రి అయినప్పుడు పొందిన మధురానుభూతిని మరోసారి తాను పొందనున్నందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు బన్నీ. ఇదే క్రమంలో తన కుమారుడు అల్లు అయాన్‌తో కలిసి ఫ్యామిలీ ఫోటో దిగిన మనోడు, ఆ ఫోటోలో అయాన్ తన తల్లి గర్భాన్ని ముద్దాడుతూ పెట్టిన పోజ్ పెట్టాడు. అది అందరికీ చాలా బాగా నచ్చడంతో ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తుంది. మరోవైపు తన ఆనందాన్ని అభిమానులతో పంచుకుంటున్న బన్నీకి.. అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.