
అక్కినేని నాగ చైతన్య, సమంత పెళ్లి తర్వాత జంటగా నటిస్తున్న సినిమా మజిలీ. శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాకు గోపి సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈమధ్యనే రిలీజైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను అలరించింది. సమంతతో పాటుగా ఈ సినిమాలో దివ్యాన్ష కౌశిక్ నటిస్తుంది. ఏప్రిల్ 5న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అదరగొట్టింది. మజిలీ సినిమాను శాటిలైట్ రైట్స్ జెమిని టివి వారు 5 కోట్లకు కొనేశారట.
డిజిటల్ రైట్స్ లో కూడా 3.5 కోట్లు కోట్ చేశారట. అమేజాన్ ప్రైం ఈ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. హింది డబ్బింగ్ రూపంలో మరో 4 కోట్లు రాబట్టిందట. అంటే థియేట్రికల్ బిజినెస్ కకుండానే మజిలీ 12 కోట్ల దాకా బిజినెస్ చేసింది. ఎలా చూసినా మజిలీ సేఫ్ ప్రాజెక్ట్ అయ్యేలా కనిపిస్తుంది. పెళ్లి తర్వాత సమంత తన ఫాం కొనసాగిస్తుండగా మజిలీ ప్రచార చిత్రాలు కూడా సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి.