ఇది రజినీకాంత్ ‘కబాలి’ సెలవు

అబ్బా..ఎంత మంచి వార్త..కబాలీ ఫిల్మ్ కోసం హాలిడే ఇచ్చేశారా..ఇంకేముంది ఫ్యామిలీతో కబాలీ సినిమా చూసేయొచ్చు..అని అనుకుంటున్నారు కదా...కానీ సెలవు ఇచ్చింది ఇక్కడ కాదు..బెంగళూరు..చెన్నై నగరాల్లో. అది కూడా పలు కంపెనీలు సెలవు ప్రకటించాయి. తమిళ సూపర్ స్టార్ 'రజనీకాంత్' నటించిన 'కబాలీ' ఈనెల 22న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ట్రైలర్ నుండి రికార్డుల మోత మోగిస్తున్న 'కబాలి' చిత్రం గురించి ఎన్నో విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు పలు ఆఫర్లు ప్రకటించాయి కూడా. 

రజనీకాంత్ సినిమా విడుదలవుతుండడంపై పలు కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ఉద్యోగులు మూకుమ్మడి సెలవులు పెట్టడం ఖాయమని భావించిన పలు కంపెనీలు ఆ రోజున సెలవు ఇస్తున్నట్లు ప్రకటించాయి. అంతేగాకుండా కొన్ని సంస్థల్లో ఉద్యోగుల కుటుంబాలకు టికెట్లు కూడా ఇచ్చేశాయంట. దటీజ్ రజనీకాంత్ అంటున్నారు అభిమానులు. మరి 'కబాలి' ఎలా మురిపిస్తోందో వేచి చూడాలి.