
బాలీవుడ్ యాక్షన్ హీరో కమ్ విలన్ విద్యుత్ జమాల్ హీరోగా హాలీవుడ్ డైరక్టర్ చుక్ రసెల్ డైరక్షన్ లో వస్తున్న సినిమా జంగ్లీ. చిన్నప్పటి నుండి భోళా అనే ఏనుగుతో స్నేహం చేస్తూ ఉండే హీరో ఏనుగుతో పాటు అతను పెరిగి పెద్దవాడవుతాడు. అయితే అడవిలోకి వేటగాళ్లు వచ్చి ఏనుగు దంతాల మీద కన్నేస్తారు. అప్పుడు భోళాను మన హీరో ఎలా కాపాడాడు అన్నది జంగ్లీ సినిమా కథ.
ఇంచుమించు అడవి దొంగ సినిమా కథలా అనిపిస్తున్న ఈ సినిమా ట్రైలర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. ట్రైలర్ మొత్తం యాక్షన్ సీన్స్ తో నింపేశారు. హీరో, ఏనుగు మధ్య వచ్చే సీన్స్ బాగున్నాయి. యాక్షన్ అడ్వెంచర్ గా వస్తున్న ఈ జంగ్లీ సినిమా ట్రైలర్ ఇంప్రెస్ చేయగా సినిమా ఎలా ఉంటుందో చూడాలి. ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది.