
లాస్ట్ ఇయర్ కోలీవుడ్ సూపర్ హిట్ మూవీస్ లో ఒకటైన 96 కు తెలుగు రీమేక్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమా దర్శకుడు ప్రేమ్ కుమార్ తెలుగు వర్షన్ ను డైరెక్ట్ చేస్తున్నారు. 96 టైటిల్ కాస్త తెలుగు వర్షన్ కు జానకి దేవిగా మార్చుతున్నారని తెలుస్తుంది. సినిమాలో హీరోయిన్ ఎస్. జానకి పాటలను పాడుతుందట. ఆమె వీరాభిమానిగా సమంత కనిపిస్తుందట.
శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో శర్వానంద్, సమంత హీరోయిన్స్ గా నటిస్తున్నారు. జానకి దేవి టైటిల్ ను ఇప్పటికే రిజిస్టర్ చేయించారట. త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్న ఈ సినిమాకు తమిళ వర్షన్ కు సంగీతం అందించిన గోవింద్ వసంత్ తెలుగు సినిమాకు సంగీతం అందిస్తున్నారట. కోలీవుడ్ లో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించిన ఈ సినిమా అక్కడ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మరి తెలుగు వర్షన్ కూడా ఆ రేంజ్ హిట్ అందుకుంటుందా లేదా చూడాలి.