
నిఖిల్ హీరోగా తమిళ సూపర్ హిట్ మూవీ కణితన్ రీమేక్ గా వస్తున్న సినిమా అర్జున్ సురవరం. మాత్రుక దర్శకుడు టి.సంతోష్ తెలుగు వర్షన్ ను డైరెక్ట్ చేస్తున్నారు. నిఖిల్ జర్నలిస్ట్ గా నటిస్తున్న ఈ సినిమా టీజర్ కొద్ది గంటల క్రితం రిలీజైంది. పెద్దవాళ్లు ఇన్వాల్వ్ అయిన ఓ స్కాం ను హీరో ఎలా ఛేదించాడనే కథతో వస్తుంది ఈ సినిమా. టీజర్ ఇంప్రెస్ చేయగా టీజర్ లో మీకు టి.ఆర్.పి పిచ్చి పట్టిందని ఛానెళ్ల మీద సెటైర్ కూడా వేశాడు దర్శకుడు.
నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. లాస్ట్ ఇయర్ కిరాక్ పార్టీ అంటూ వచ్చి పెద్దగా ఆకట్టుకోలేని నిఖిల్ ఈసారి అర్జున్ సురవరం మీద చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా సినిమాకు ప్రత్యేకత ఉండేలా చూసుకుంటున్న నిఖిల్ కు ఇప్పటివరకు స్టార్ ఇమేజ్ రాలేదు. దానికోసమే ఈ హీరో బాగా ప్రయత్నిస్తున్నాడు.