మైత్రితో వరుణ్ తేజ్..!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మిగతా మెగా హీరోలకు భిన్నంగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఈ క్రమంలో అంతరిక్షం లాంటి షాకులు తగులుతున్నా మళ్లీ ఎఫ్-2 రూపంలో హిట్టు పలుకరించింది. ప్రస్తుతం వరుణ్ తేజ్ వాల్మీకి సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత మైత్రి మూవీ మేకర్స్ తో వరుణ్ తేజ్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. డెబ్యూ డైరక్టర్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ త్వరలోనే రానుందట.

మెగా హీరోలతో మైత్రి మూవీ మేకర్స్ వరుస సినిమాలు చేస్తున్నారు. రాం చరణ్ తో రంగస్థలం సినిమా చేసిన ఈ నిర్మాతలు ప్రస్తుతం సాయి ధరం తేజ్ తో చిత్రలహరి సినిమా నిర్మిస్తున్నారు. తేజూ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమాకు వీరే నిర్మాతలు. ఇవి రెండూ కాకుండానే వరుణ్ తేజ్ తో సినిమాకు లైన్ క్లియర్ చేశారట. మరి మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ అదిరిపోయేలా ఉండగా ఆ సినిమాల ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.