సైరాలో చిన్న పాత్రే కాని..!

మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమాగా వస్తున్న సైరా నరసింహా రెడ్డి వస్తుంది. ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి బయోపిక్ గా వస్తున్న ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. కోణిదెల ప్రొడక్షస్ లో రాం చరణ్ 200 కోట్ల పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా వస్తుంది. అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు సినిమాలో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మెగా డాటర్ నిహారిక కూడా చిన్న పాత్ర చేస్తుందని తెలుస్తుంది.        

ఈమధ్యనే నిహారికకు సంబందించిన షూటింగ్ పూర్తి చేశారట. గిరిజన యువతి పాత్రలో నిహారిక కనిపిస్తుండగా నరసింహా రెడ్డికి అనుకోని ఆపద వచ్చినప్పుడు ఆమె ఆశ్రయం ఇస్తుందట. నిహారికది చిన్న పాత్రే కాని సినిమాలో ఆ సన్నివేశం బాగా వచ్చిందని తెలుస్తుంది. ముందు సమ్మర్ రిలీజ్ ప్లాన్ చేసినా ఆగష్టు 15న సైరా నరసింహా రెడ్డి వస్తున్నట్టు తెలుస్తుంది.