
సూపర్ స్టార్ మహేష్ ఫుల్ టైం నిర్మాతగా మారుతూ మొదటి ప్రయత్నంగా చేస్తున్న సినిమా మేజర్. అడివి శేష్ హీరోగా వస్తున్న ఈ సినిమాను గూఢచారి డైరక్టర్ శషి కిరణ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు మేజర్ టైటిల్ ఫిక్స్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కొన్నాళ్లుగా అడివి శేష్ ఈగర్ గా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్ గురించి మహేష్ బాబు వెళ్లడించడం విశేషం.
26/11 దాడి జరిగినప్పుడు ప్రజలను కాపాడేందుకు మేజర్ ఉన్నికృష్ణన్ కీలక పాత్ర పోశించారు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ స్పూర్తితో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇది తన డ్రీం ప్రాజెక్ట్ అని చెప్పడానికి తన దగ్గర ఉన్న రీజన్స్ వెళ్లడించాడు అడివి శేష్. తెలుగు, హింది భాషల్లో ఈ సినిమా వస్తుంది. సో ఈ సినిమాతో తెలుగులో కొంతమంది నటులు బాలీవుడ్ కు పరిచయమవుతున్నారు.
మేజర్ ఉన్నికృష్ణన్ జీవిత కథ స్పూర్తితో సినిమా చేయడం రెండో మేజర్ న్యూస్.. మూడు సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమాను నిర్మిస్తుండటం.. నాలుగు సోనీ పిక్చర్స్ ఇండియా సంస్థ ఈ సినిమా నిర్మాణంలో భాగమవుతుంది. ఐదు ఈ సినిమా మమ్మల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తుందని అడివి శేష్ ట్వీట్స్ చేశాడు.