
కింగ్ నాగార్జున కెరియర్ లో సూపర్ హిట్టైన సినిమా మన్మధుడు. విజయ భాస్కర్ డైర్క్షన్ లో వచ్చిన ఆ సినిమా నాగ్ కెరియర్ లో సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమాకు సీక్వల్ గా ఇప్పుడు మన్మధుడు-2 వస్తుంది. చిలసౌ సినిమాతో దర్శకుడిగా తన ప్రతిభ చాటుకున్న రాహుల్ రవింద్రన్ డైరక్షన్ లో ఈ సినిమా వస్తుంది. ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 15 నుండి సెట్స్ మీదకు వెళ్తుందట.
సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుండగా అనుష్క కూడా సెకండ్ హీరోయిన్ గా కనబడనుందట. ఇక ఈ సూపర్ హిట్ సినిమా సీక్వల్ లో అక్కినేని కోడలు సమంత కూడా నటిస్తుందని తెలుస్తుంది. సినిమాలో సమంతకు ఓ ఇంపార్టెంట్ రోల్ ఉంటుందట. చిన్న పాత్రే అయినా సినిమాను టర్న్ చేస్తుందని అంటున్నారు. పెళ్లి తర్వాత సినిమాలు, ఫోటో షూట్స్ ఇలా ఏ విషయంలో తగ్గని సమంత మన్మధుడు-2లో ఎలా కనిపించనుందో చూడాలి. ఆల్రెడీ నాగార్జునతో మనం సినిమాలో కలిసి నటించిన సమంత రాజు గారి గది-2లో కూడా కలిసి నటించారు.. సో ఈ ఇద్దరు మళ్లీ కలిసి మన్మధుడు-2లో చేస్తున్నారు.