కార్తికి జోడీగా రష్మిక..!

కన్నడ పరిశ్రమ నుండి వచ్చిన రష్మిక మందన్న తెలుగులో సూపర్ ఫాం కొనసాగిస్తుంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తున్న రష్మిక తమిళంలో మొదటి సినిమా ఛాన్స్ పట్టేసింది. కోలీవుడ్ లో కార్తి హీరోగా డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ లో వస్తున్న సినిమాలో  రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. రెమో ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. 

ఈ ప్రొడక్షన్ లో ప్రస్తుతం సూర్య ఎన్.జి.కే సినిమా వస్తుంది. ఇంతకుముందు కార్తి కూడా ఈ బ్యానర్ లో ఖాకి సినిమా చేశాడు. ఇప్పుడు అదే బ్యానర్ లో ఈ సినిమా వస్తుండటం విశేషం. తెలుగులో లక్కీ హీరోయిన్ గా సత్తా చాటుతున్న రష్మిక తమిళంలో కూడా ఆ సక్సెస్ ఫాంను కొనసాగించాలని చూస్తుంది. మరి కార్తికి జోడీగా చేస్తున్న రష్మిక తమిళంలో ఎలాంటి ఫలితాన్ని తెచ్చుకుంటుందో చూడాలి.